CM Ramesh: దీక్ష విరమించండి.. ఇక్కడ మేం అన్ని విషయాలూ చర్చిస్తున్నాం!: సీఎం రమేష్‌తో ఫోన్‌లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి

షార్ట్స్‌లో చూడండి
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌తో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఇక దీక్ష విరమించాలని, తాము టీడీపీ ఎంపీలతో ఢిల్లీలో అన్ని విషయాలు చర్చిస్తున్నామని కోరారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని సీఎం రమేష్‌ తేల్చి చెప్పారు. కాగా, ఢిల్లీలో చౌదరి బీరేంద్రసింగ్‌తో టీడీపీ ఎంపీల సమావేశం కొనసాగుతోంది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కేంద్ర సర్కారు చెబుతోన్న సమస్యలపై ఎంపీలు మరోసారి స్పష్టత ఇస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను బీరేంద్రసింగ్‌కు అందజేయనున్నారు. 
Go Back to Shorts
CM Ramesh
Andhra Pradesh
Telugudesam

More Telugu News