ajith: సంక్రాంతి బరిలోకి మరో స్టార్ హీరో!

  • అజిత్ హీరోగా 'విశ్వాసం'
  • 40 శాతం చిత్రీకరణ పూర్తి
  • కథానాయికగా నయనతార
తమిళ స్టార్ హీరోగా అజిత్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే భారీ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'విశ్వాసం' రూపొందుతోంది. శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 40 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి పనులు పూర్తికావనే ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. దీపావళికి విజయ్ .. మురుగదాస్ సినిమా వస్తుండటం వలన థియేటర్ల సమస్య తలెత్తుతుందనేది మరో కారణం. అందువలన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. సంక్రాంతికి తెలుగులోను గట్టిపోటీ ఉండటం వలన, కొంతసమయం తీసుకుని ఆ తరువాత తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.   
ajith
nayantara

More Telugu News