kanna: ఆమధ్య తిరుపతి పర్యటనలో అమిత్‌ షా హత్యకు కుట్ర.. ఇప్పుడు నాపై హత్యాయత్నం!: కన్నా లక్ష్మీనారాయణ

  • అనంతపురంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్టహౌస్‌ వద్ద ఉద్రిక్తత
  • మండిపడ్డ కన్నా లక్ష్మీనారాయణ
  • పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారని ఆరోపణ
అనంతపురంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటన సందర్భంగా బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్ హౌస్‌ వద్ద కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహిస్తోన్న సమయంలో ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ... ఆమధ్య తిరుపతి పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హత్యకు కుట్ర జరిగిందని.. ఇప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందని వ్యాఖ్యానించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. 
kanna
BJP
Telugudesam

More Telugu News