kcr: ముక్కుపుడకను తలపై మోస్తూ ఆలయంలోకి వెళ్లిన కేసీఆర్... పక్కనే మంత్రి దేవినేని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాజాభజంత్రీలతో ముఖ్యమంత్రిని ఆలయం లోపలకు తీసుకెళ్లారు. ముక్కుపుడకను తలపై మోస్తూ, కుటుంబ సమేతంగా ఆలయం లోపలకు ఆయన వెళ్లారు.
ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు ఏపీ మంత్రి దేవినేని ఉమ, టీఎస్ మంత్రులు నాయిని, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కేకేలు ఉన్నారు. నన్నపనేని రాజకుమారి కూడా ఆలయానికి చేరుకున్నారు. కాసేపట్లో అమ్మవారికి కేసీఆర్ ముక్కుపుడకను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన ఆలయంలో ఉంటారు.