Chandrababu: చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతూ... ట్వీట్లు చేసిన ఐవైఆర్

  • తిరుమల ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ కోరిన చంద్రబాబు
  • హైకోర్టు విచారణ అనవసరమన్న ఐవైఆర్
  • తొలుత ప్రాథమిక విచారణ జరిపించాలంటూ సూచన
తిరుమల ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని... కోర్టు విచారణ అనవసరమని ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. తొలుత ప్రాథమిక విచారణ జరిపించాలని... ఆ తర్వాత అవసరమైతే హైకోర్టు విచారణను కోరవచ్చని చెప్పారు. ఇప్పటికిప్పుడు హైకోర్టు జడ్జి చేత విచారణను కోరితే... రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డిలపై వేసిన పరువునష్టం దావాలు కూడా అర్థ రహితంగా మారుతాయని అన్నారు.

కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం న్యాయ విచారణ కోరితే... అది సరైంది కాదని ఐవైఆర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత న్యాయస్థానాలు తమ అమూల్యమైన సమయాన్ని దాని కోసం వెచ్చించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పారు.
Chandrababu
iyr krishnarao
ttd
High Court

More Telugu News