Andhra Pradesh: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్

  • ఇన్నాళ్లూ తాత్కాలిక సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్
  • రెండేళ్ల తర్వాత రెగ్యులర్ చీఫ్ జస్టిస్
  • పాట్నా హైకోర్టు జడ్జికి పదోన్నతి
ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు రెండేళ్ల తర్వాత రెగ్యులర్ చీఫ్ జస్టిస్ నియమితులయ్యారు. చత్తీస్‌గడ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ వ్యవహరిస్తున్నారు. జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ఏపీకి రావడంతో పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠీకి పదోన్నతి కల్పించి, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
Andhra Pradesh
Telangana
High Court

More Telugu News