modi: కొత్తవలస - కొరాపుట్ రైల్వే లైన్ జంబ్లింగ్ పనులపై పీఎం ఆరా

  • ఏపీలోని కొత్తవలస.. ఒడిశాలోని కొరాపుట్ మధ్య రైల్వే పనులు
  • పీఎంఓ కార్యాలయం నుంచి వీడియా కాన్ఫరెన్స్ నిర్వహణ
  • జంబ్లింగ్ పనుల గురించి వివరించిన రైల్వే బోర్డు చైర్మన్  
కొత్తవలస-కొరాపుట్ మధ్య జరుగుతున్న రైల్వే లైన్ జంబ్లింగ్ పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ప్రగతి కార్యక్రమం కింద10 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పీఎంఓ కార్యాలయం నుంచి ఆయన వీడియా కాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు.

ముందుగా రైల్వే బోర్డు చైర్మన్ అశ్విన్ లోహణి మాట్లాడుతూ, ఏపీలోని కొత్తవలస- ఒడిశాలోని కొరాపుట్ మధ్య రైల్వే లైన్ లో జరుగుతున్న జంబ్లింగ్ పనులను వివరించారు. 189 కిలో మీటర్లలో 4 భాగాలుగా ఈ పనులు చేపట్టామని చెప్పారు. అనంతరం, ఏపీ ఇంఛార్జి సీఎస్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ, తమ రాష్ట్ర పరిధిలో జరుగుతున్న జంబ్లింగ్ పనులను నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తి చేస్తామని మోదీకి తెలిపారు. 
modi
kothavalasa-koraput

More Telugu News