KCR: కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం సాయంత్రం వరకు వేచి చూసిన డీఎస్‌!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్‌ ఈరోజు కలుస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, సీఎం అపాయింట్‌ మెంట్‌ కోసం ఆయన ఈరోజు సాయంత్రం వరకు ఎదురుచూసినప్పటికీ... ఈరోజు అపాయింట్‌మెంట్‌ లేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. రేపు అందుబాటులో ఉంటే చెబుతామని డీఎస్‌కి సీఎంవో చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ నేతలు తమ పార్టీ అధిష్ఠానానికి డీఎస్‌పై ఈ రోజు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. మరోపక్క, ఆయన ఆ పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.         
Go Back to Shorts
KCR
DS
Congress
TRS

More Telugu News