Pawan Kalyan: ఉత్తరాంధ్ర మరో తెలంగాణ అయ్యే సమయం ఎంతో దూరంలో లేదు: పవన్ కల్యాణ్

  • ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ ఉద్యమం మరింత పెరిగే అవకాశం ఉంది
  • తెలంగాణ ఉద్యమం కూడా ఇలాగే ప్రారంభమైంది
  • పాలకుల తీరు మారకుంటే కొన్నేళ్లలోనే ఉత్తరాంధ్ర రాష్ట్రం
ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భాగమైన ఉత్తరాంధ్ర మరో తెలంగాణ కావడానికి ఎంతో దూరం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ ఉద్యమం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ప్రాంతంపై ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే మరో తెలంగాణ అవుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కూడా ఇలాగే ప్రారంభమయిందని అన్నారు. ఏపీ నేతల అధికారంలో అణచివేత, క్రూరత్వం భరించి... చివరకు రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశారని చెప్పారు. ఏపీ పాలకుల తీరు మారకుంటే... మరికొన్ని సంవత్సరాలు, లేదంటే అంతకు ముందే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అవుతుందని తెలిపారు.
Pawan Kalyan
uttarandhra

More Telugu News