shakalaka shankar: నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ అనేది ప్రచారం మాత్రమే: షకలక శంకర్

  • ఎవరు ఎవరిని బాధపెట్టినా నాకు నచ్చదు 
  • అది అన్యాయం అనిపిస్తే ఊరుకోను
  • అందువలన ఇలా అనుకుంటున్నారేమో
కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటూ .. హాస్యకథా చిత్రాల్లో హీరోగాను నిలదొక్కుకోవడానికి షకలక శంకర్ తనవంతు కృషి చేస్తున్నాడు. అయితే ఆయనకి షార్ట్ టెంపర్ ఎక్కువనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని గురించిన ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైతే, తనదైన శైలిలో స్పందించాడు.

"నేను ఎవరిమీద కోప్పడ్డానో మీరే చెప్పండి .. ఒక్కళ్ల పేరు చెప్పినా నాకు షార్ట్ టెంపర్ అని ఒప్పేసుకుంటాను. ఎదుటివాళ్ల ధోరణి బాధను కలిగించినప్పుడు .. వాళ్లకి కాస్త దురుసుగా సమాధానమిస్తానేమోగానీ, వెంటనే రియాక్ట్ కావడం .. కోపంతో మీదపడిపోవడం చేయను. నా కళ్లముందు ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే నేను జోక్యం చేసుకుంటాను. ఎవరైతే బాధ పెడుతున్నారో .. అది కరెక్ట్ కాదని వాళ్లకి చెప్పేస్తాను. అది నా బాధ్యతగా .. ధర్మంగా భావిస్తాను. అందువలన నేను కొంతమందికి షార్ట్ టెంపర్ మనిషిగా కనిపించి ఉండొచ్చు" అని చెప్పుకొచ్చాడు. 
shakalaka shankar

More Telugu News