DS: కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో డీఎస్‌ కీలక భేటీ

షార్ట్స్‌లో చూడండి
టీఆర్‌ఎస్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) పై ఆ పార్టీ నిజామాబాద్‌ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోపక్క ఆయన టీఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాసేపట్లో టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో డీఎస్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఏకమైన సమయంలో కేసీఆర్‌తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలో ఉన్న తన కుమారుడికి అనుకూలంగా డీఎస్‌ వ్యవహరిస్తున్నారని కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.      
Go Back to Shorts
DS
KCR
Telangana

More Telugu News