manchu manoj: రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేపై హీరో మంచు మనోజ్ స్పందన

  • మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశంగా ఉండటం బాధాకరం
  • సురక్షితమైన దేశంగా చేసేందుకు బాధ్యతగా వ్యవహరిద్దాం
  • ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకురావాలి
మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడి కావడంపై ప్రముఖ హీరో మంచు మనోజ్ స్పందించాడు. మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశంగా ఉండటం చాలా బాధాకరమని మనోజ్ ఓ ట్వీట్ లో చెప్పాడు. భారత్ ను మహిళలకు సురక్షితమైన దేశంగా చేసేందుకు మనం బాధ్యతగా వ్యవహరించి, ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కోరాడు. కాగా, మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో రెండో స్థానంలో సోమాలియా, మూడో స్థానంలో సౌదీ అరేబియా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది.
manchu manoj
reuters survey

More Telugu News