YSRCP: కాంగ్రెస్ తో జతకట్టేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు: లక్ష్మీపార్వతి

  • చంద్రబాబు పచ్చి అవకాశవాది
  • అవసరమనుకుంటే కాళ్లు పట్టుకుంటారు
  • చంద్రబాబుకు ప్రజలు తగినబుద్ధి చెబుతారు
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి విమర్శలు చేశారు. తనకు బీజేపీ అంటే ఇష్టం లేదని గతంలో చెప్పిన చంద్రబాబు, 2014 ఎన్నికలు వచ్చే సరికి మోదీ కాళ్లు పట్టుకున్నారని, ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పచ్చి అవకాశవాదని, అవసరమనుకుంటే కాళ్లు పట్టుకునే చంద్రబాబు..ఆ అవసరం తీరాక విసిరి గోదార్లో పారేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటిలబుద్ధిగల చంద్రబాబుకు ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు.
YSRCP
Chandrababu
lakshmi parvathi

More Telugu News