kcr: కనకదుర్గమ్మకు మొక్కుల చెల్లింపు.. రేపు విజయవాడ వెళ్లనున్న కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుటుంబ సమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుతూ కేసీఆర్ పలు మొక్కులు మొక్కుకున్న సంగతి తెలిసిందే.

 తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు సాలిగ్రామ హారం, పేటల కంటె, తిరుచానూరు అమ్మవారికి బంగారు ముక్కుపుడక, వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు పూతగల కిరీటం, విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక, కురివి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చెల్లిస్తానని ఆయన మొక్కుకున్నారు. ఇప్పటికే ఇతర మొక్కులను తీర్చుకున్న ఆయన... రేపు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Go Back to Shorts
kcr
vijayawada
kanakadurga

More Telugu News