jagan: న్యూజిలాండ్ పర్యటనలో బంగీ జంప్ చేసిన జగన్... విజువల్స్ చూడండి

  • గత ఏడాది కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన జగన్
  • కవారా బ్రిడ్జ్ పై నుంచి బంగీ జంప్
  • వైరల్ అవుతున్న వీడియో
గత ఏడాది వైసీపీ అధినేత జగన్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్ పై నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మరోవైపు, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడానికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ... అప్పట్లో సీబీఐ కోరినప్పటికీ... కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో, ఆయన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. మరోవైపు, జగన్ చేపట్టిన పాదయాత్ర నేటితో 200వ రోజుకు చేరుకుంది.
jagan
bungey jump
newzealand

More Telugu News