C Srinivas: కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగిన డీఎస్... ఇప్పుడు కుదరదని సమాధానం!

  • టీఆర్ఎస్ లో డీఎస్ కు వ్యతిరేక పవనాలు
  • తన వాదన వినిపించాలని భావించిన డీఎస్
  • అపాయింట్ మెంట్ ఇవ్వలేమన్న సీఎంఓ
టీఆర్ఎస్ పార్టీలో తనకు వ్యతిరేకంగా వీస్తున్న పవనాల తీవ్రతను అర్థం చేసుకున్న డీఎస్, కేసీఆర్ ను కలిసి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు తెలుస్తోంది. ఆయన అపాయింట్ కావాలని డీఎస్ కోరగా, ప్రస్తుతం కుదరదని సీఎం కార్యాలయ వర్గాల నుంచి సమాధానం వచ్చినట్టు సమాచారం.

 ఈ ఉదయం నిజామాబాద్ లో సమావేశమైన టీఆర్ఎస్ జిల్లా కార్యవర్గం, డీఎస్ ను పార్టీ నుంచి సాగనంపాలని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో మాట్లాడాలని డీఎస్ తనవంతు ప్రయత్నాలు చేశారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. డీఎస్ ను పార్టీ నుంచి తొలగించాలని ఇప్పటికే టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నందునే కేసీఆర్ అపాయింట్ మెంట్ లభించలేదని తెలుస్తోంది.
C Srinivas
TRS
KCR
Appointment

More Telugu News