julakanti rangareddy: మాజీ ఎమ్మెల్యే జూలకంటి హౌస్ అరెస్ట్

  • కలెక్టరేట్ల ముట్టడికి బీఎల్ఎఫ్ పిలుపు
  • బీఎల్ఎఫ్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు
  • అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరన్న జూలకంటి
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయనను గృహ నిర్బంధం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ముట్టడికి బీఎల్ఎఫ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు బీఎల్ఎఫ్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ, అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నారు.
julakanti rangareddy
house arrest
blf

More Telugu News