dhamma praja party: తెలంగాణలో ఆవిర్భవించిన మరో రాజకీయ పార్టీ

  • ధమ్మ ప్రజా పార్టీ ఆవిర్భావం
  • బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామన్న పార్టీ అధ్యక్షుడు
  • త్వరలోనే విధివిధానాలు, మేనిఫెస్టో వెల్లడి
తెలంగాణలో మరో కొత్త పార్టీ అవతరించింది. ఆ పార్టీ పేరు 'ధమ్మ ప్రజా పార్టీ'. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ మేడే శాంతికుమార్ మాట్లాడుతూ, దేశంలో ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేసే పార్టీలు మాత్రమే ఆవిర్భవిస్తూ వచ్చాయని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. త్వరలోనే పార్టీ విధివిధానాలను, మేనిఫెస్టోను వెల్లడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కార్యనిర్వాహక కార్యదర్శి నరసింహ, సంయుక్త కార్యదర్శి శ్యాంసుందర్, కోశాధికారి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
dhamma praja party
telangana

More Telugu News