Jarkhand: మందుపాతర పేల్చి ఆరుగురు జవాన్లను బలిగొన్న మావోలు!

  • జార్ఖండ్ లోని గర్హ్వా జిల్లాలో ఘటన
  • జాగ్వార్ ఫోర్స్ కు చెందిన జవాన్ల మృతి
  • మరికొందరికి గాయాలు
జార్ఖండ్ మావోయిస్టులు పేల్చిన శక్తిమంతమైన మందుపాతర ఆరుగురు జవాన్లను బలితీసుకుంది. గర్హ్వా జిల్లాలో ఈ ఘటన జరిగిందని ఆరుగురు జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్ దళ సభ్యులు మరణించారని డీఐజీ విపుల్ శుక్లా తెలిపారు. జిల్లాలోని చింజో ప్రాంతంలో మావోలు సంచరిస్తున్నారని తెలుసుకుని జాగ్వార్ ఫోర్స్ అక్కడికి వెళ్లిందని, తొలుత ల్యాండ్ మైన్ ను పేల్చిన మావోలు, ఆపై కాల్పులకు దిగారని, ఈ ఘటనలో పలువురు జవాన్లకు గాయాలు అయ్యాయని వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, ఆ ప్రాంతానికి అదనపు బలగాలు పంపించామని ఆయన తెలిపారు.
Jarkhand
Land Mine
Blast
Jaguar Force

More Telugu News