Chandrababu: ‘గాలి’ అండ్ బ్యాచ్ నాటకాలాడుతున్నారు: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో గాలి జనార్దన్ రెడ్డి అండ్ బ్యాచ్ నాటకాలాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతిపరులను కట్టడి చేయలేని పరిస్థితిలో బీజేపీ ఉందని, అవినీతి పార్టీలన్నీ ఓ వైపు చేరాయని అన్నారు. బీజేపీ - వైసీపీ దొంగాటలు బయటపెట్టాలని, ఆకుల సత్యనారాయణ- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు కలిశారో ప్రజలకు చెప్పాలని అన్నారు.

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా ఆయన విమర్శలు చేశారు. వైసీపీకి సొంత మైక్ లా, బీజేపీకి అద్దె మైక్ లా కన్నా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించాలని సమన్వయ కమిటీలో పిలుపు నిచ్చారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, రేపు సైకిల్ ర్యాలీలు, ఎల్లుండి ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
gali janardhan

More Telugu News