Telugudesam: టీడీపీ పొలిట్ బ్యూరోలో గల్లా అరుణకు స్థానం

  • సీనియర్ నేతకు దక్కిన అవకాశం
  • కీలక నిర్ణయం తీసుకున్న పార్టీ అధిష్ఠానం
  • ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా ఉన్న గల్లా
సీనియర్ నేత, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి గల్లా అరుణకుమారికి పార్టీ పొలిట్ బ్యూరోలో అవకాశం లభించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ
పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. గల్లా అరుణ పార్టీని వీడుతున్నారనే వార్తలు ఇటీవల హల్ చల్ చేశాయి. దాంతో, టీడీపీని వీడే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచన తనకు లేదని, వైసీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని ఆమె చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నియామకం జరగడం గమనార్హం.
Telugudesam
galla

More Telugu News