Asaduddin Owaisi: పెద్దవాళ్లు మాట్లాడుతుంటే పిల్లలు నోరు విప్పకూడదు: బీజేపీ నేతకు అసదుద్దీన్‌ ఓవైసీ చురకలు

  • ఓవైసీని న్యూ జిన్నా అంటూ సంబీత్‌ పాత్రా విమర్శ
  • ముస్లింలను రెచ్చగొట్టే వ్యూహం అవలంబిస్తున్నారని ఆరోపణ
  • సంబిత్ ఓ పిల్లోడంటూ ఓవైసీ ఎద్దేవా
హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీని న్యూ జిన్నా అంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబీత్‌ పాత్రా అభివర్ణించారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.... ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూసినప్పుడు కొత్త జిన్నాగా ఆయనను అభివర్ణించడానికి వెనుకాడాల్సిన పని లేదని, ముస్లింలను ప్రధాన జీవన స్రవంతి నుంచి తప్పించే విధంగా ఆయన అనుసరిస్తోన్న రెచ్చగొట్టే వ్యూహం చాలా ప్రమాదకరమని అన్నారు.

అలాగే, తాము తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వస్తామని, అలాగే ముందస్తు ఎన్నికలు ఊహాగానాలేనని చెప్పారు. కాగా, తనను న్యూ జిన్నాగా అభివర్ణించడంపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సంబిత్ ఓ పిల్లోడని, అటువంటి వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, అలాంటి వారికి వ్యతిరేకంగానే తన పోరాటం కొనసాగిస్తున్నానని అన్నారు. పెద్దవాళ్లు మాట్లాడుతుంటే పిల్లలు నోరు విప్పకూడదని ఎద్దేవా చేశారు.
Asaduddin Owaisi
MIM
BJP

More Telugu News