Chandrababu: చంద్రబాబులో ఒక అపరిచితుడిని చూస్తున్నాం: కన్నా తీవ్ర వ్యాఖ్యలు

  • నిన్నటి వరకు ‘కాంగ్రెస్’ని చంద్రబాబు విమర్శించారు
  • ఇప్పుడేమో, ఆ పార్టీనే న్యాయం చేసిందని చెబుతున్నారు
  • చంద్రబాబువి మతిభ్రమించిన మాటలు
సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న చంద్రబాబు, ఇప్పుడు ఆ పార్టీనే న్యాయం చేసిందని మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనలో ఓ అపరిచితుడిని చూస్తున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపింది తమ పార్టీయేనని, ఆ సంగతి మర్చిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముంపు మండలాలను ఏపీలో మోదీ కలపకపోతే ‘పోలవరం’ కలగానే మిగిలిపోయేదని అన్నారు.

 పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన పెండింగ్ బకాయిల విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా తాము వివరాలు అడిగితే.. ఎటువంటి బకాయిలు లేవని తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ విషయమై ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఈ పరిశ్రమ ఇస్తుందని తెలిసే టీడీపీ నాయకులు ఆమరణ దీక్ష డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
Chandrababu
kanna

More Telugu News