akhil: స్పీడు పెంచిన అఖిల్ .. నాల్గొవ సినిమాకి కథ రెడీ

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 
  • షూటింగు దశలో సినిమా 
  • మరో ప్రాజెక్టుకు సన్నాహాలు
ప్రస్తుతం మూడవ సినిమా పనుల్లో అఖిల్ బిజీగా వున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. మూడవ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా సమయం తీసుకున్న అఖిల్, నాల్గొవ సినిమాను మాత్రం అప్పుడే లైన్లో పెట్టేసినట్టుగా సమాచారం.

రచయిత గోపీమోహన్ ఇటీవల అఖిల్ ను కలిసి ఒక కథను వినిపించాడట. ఈ కథ నచ్చడంతో వెంటనే అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే గోపీమోహన్ ఈ సినిమాకి రచయితగానే వ్యవహరిస్తాడా? .. లేకపోతే దర్శకుడిగా కూడా వ్యవహరిస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. దర్శకుడు ఎవరనే సంగతి అటుంచితే కథ మాత్రం రెడీగానే వుంది. సాధ్యమైనంత త్వరగానే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశాలు వున్నాయనే టాక్ మాత్రం ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.     
akhil
venky atluri

More Telugu News