Russia: ముద్దు పెట్టబోతే చాకచక్యంగా తప్పించుకున్న మహిళా రిపోర్టర్... వైరల్ అవుతున్న వీడియో!

  • రష్యా ఫుట్ బాల్ పోటీలను కవర్ చేసేందుకు వెళ్లిన బ్రెజిల్ జర్నలిస్ట్
  • ముద్దు పెట్టబోయిన ఆకతాయి
  • తప్పించుకుని చివాట్లు పెట్టిన మహిళా రిపోర్టర్
రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలను లైవ్ కవరేజ్ ద్వారా అందించాలని వెళ్లిన మహిళా రిపోర్టర్లకు వేధింపులు కొనసాగుతున్నాయి. పది రోజుల క్రితం ఓ జర్మనీ టీవీ చానల్ లో పనిచేస్తున్న రిపోర్టర్  జూలియట్‌ గోంజాలెజ్‌ థెరాన్‌ ప్రత్యక్ష ప్రసారం ఇస్తుంటే, ఓ వ్యక్తి వచ్చి ముద్దుపెట్టిన ఘటనను మరువకముందే, మరో యువతికి అదే తరహా అనుభవం ఎదురైంది. అయితే, ఈసారి ఆమె చాకచక్యంగా తప్పించుకుని, తనను కిస్ చేసేందుకు వచ్చిన వ్యక్తికి చివాట్లు పెట్టగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

బ్రెజిల్ కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్ అనే మహిళా జర్నలిస్ట్ యోకాటెరిన్ బర్గ్ నుంచి రిపోర్టును ఇస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెను సమీపించి ముద్దు పెట్టబోయాడు. అతన్నుంచి తప్పించుకున్న జూలియా, ఇది మంచి పద్ధతి కాదని చివాట్లు పెట్టింది. ఓ అమ్మాయి పట్ల ఇలా చేయడం తగదని, ఇంకోసారి ఇలా చేయవద్దని మండిపడింది. జరిగిన ఘటనపై ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇక్కడిలా జరగడం రెండోసారని, దాని గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని వ్యాఖ్యానించింది. తన అదృష్టం బాగుండి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది. రష్యాలో ఇటువంటి పరిస్థితులు చాలానే ఎదురవుతున్నాయని పేర్కొంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Russia
Football
Kiss
Live Coverage
Reporter
Brazil

More Telugu News