Nellore District: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... టీవీ నటుడు సునీల్ దుర్మరణం

  • కొడవలూరు మండల పరిధిలో ఘటన
  • హైదరాబాద్ వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్
  • కోమాలో మరో యువకుడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు నన్నం సునీల్ మరణించాడు. ఆయన వయసు 24 సంవత్సరాలు. కొడవలూరు మండల పరిధిలోని రాచర్లపాడు వద్ద నేషనల్ హైవేపై అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, పడుగుపాడు గ్రామానికి చెందిన షకీల్, హైదరాబాద్ లో సినీ సంగీత దర్శకుడిగా పనిచేస్తుండగా, బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన సునీల్‌ కొన్నేళ్లుగా ఆయన వద్ద శిక్షణ పొందుతూ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్నాడు.

షకీల్ తమ్ముడు సలావుద్దీన్ ఓ ఇంటర్వ్యూ నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లగా, అదే కారులో స్వగ్రామానికి వెళ్లేందుకు సునీల్ కూడా బయలుదేరాడు. రాచర్లపాడు వద్ద గుర్తు తెలియని వాహనం వీరి కారును ఢీకొనగా, సునీల్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో సలావుద్దీన్ కోమాలోకి వెళ్లాడు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
Nellore District
Actor
Sunil
Road Accident

More Telugu News