Chandrababu: ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి ఆభరణాలపై న్యాయ విచారణ: సీఎం చంద్రబాబు

  • సంబంధిత కమిటీ ముందే ఆభరణాల పరిశీలన జరుగుతుంది
  • శ్రీవారికి లేని డైమండ్లు, నగలు ఉన్నాయంటూ ఆరోపణలు తగదు
  • భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపడతాం
తిరుమల శ్రీవారి ఆభరణాల వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఓ కీలక ప్రకటన చేశారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి ఆభరణాలపై న్యాయ విచారణ చేపడతామని ప్రకటించారు.  సంబంధిత కమిటీ ముందే ఆభరణాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. శ్రీవారికి లేని డైమండ్లు, నగలు ఉన్నాయంటూ కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 
Chandrababu
Tirumala

More Telugu News