kamalnath: సీనియర్ నేత కమల్ నాథ్ కాళ్లకు బూట్లు తొడిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. విమర్శలు!

  • బూట్లు తొడిగిన ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • కమల్ నాథ్ నా తండ్రిలాంటి వారు అన్న ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత ఊర్మిళ సింగ్ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో, ఆమెకు కమల్ నాథ్ నివాళి అర్పించారు. అనంతరం ఆయన కాళ్లకు ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్ బూట్లు తొడిగారు. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై రజ్నీష్ సింగ్ స్పందిస్తూ... కమల్ నాథ్ తనకు తండ్రిలాంటి వారని చెప్పారు. నేను చదువుకుంటున్న రోజుల నుంచి ఆశీర్వాదం కోసం ఆయన కాళ్లను తాకుతూనే ఉన్నానని అన్నారు. ఆయనతో తన కుటుంబానికి, ముఖ్యంగా తన తండ్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమల్ నాథ్ నివాళి అర్పించినప్పుడు అక్కడ ఎంతో మంది ఉన్నారని... దీంతో బూట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడం ఆయనకు కష్టమైందని... ఈ క్రమంలో, తాను బూట్లు తీసుకొచ్చి, ఆయన పాదాలకు తొడిగి, సహాయం చేశానని చెప్పారు. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. 
kamalnath
rajnish singh
boots

More Telugu News