parliament: జూలై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం

  • జూలై 18 నుంచి ఆగస్ట్10వ తేదీ వరకు సమావేశాలు
  • ట్రిపుల్ తలాక్ బిల్లును మరోసారి ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • విపక్షాలు సహకరించాలన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 18 నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు జాతీయ ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లు, ట్రాన్స్ జెండర్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది.

 ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ, ఉభయసభలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. మరోవైపు, కర్ణాటక ఎన్నికల్లో తగినంత బలం లేకపోయినప్పటికీ... ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేసిన యత్నాలను పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 
parliament
masson
session
schedule

More Telugu News