subhalekha sudhakar: నేను ఈ క్షణం గురించే ఆలోచిస్తాను .. అదే నాలోని మైనస్: శుభలేఖ సుధాకర్

  • నిన్నటి గురించి పట్టించుకోను
  • రేపటి గురించి ఆలోచించను 
  • ఆలోచించాలి అంటుంది శైలజ  
తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ తన గురించిన విషయాలను పంచుకున్నారు . "నటుడిగా నా సుదీర్ఘమైన ప్రయాణంలో ఓర్పుతో ఉండటం నేర్చుకున్నాను .. యాంత్రికంగా ఉండటం మాత్రం నేర్చుకోలేదు. నేను ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తాను .. ఈ క్షణం కోసమే బతుకుతాను.

జరిగిపోయిన నిన్నటి గురించి .. జరగాల్సిన రేపటి గురించి నేను ఎంతమాత్రం ఆలోచించను. రేపు ఏమీ లేకపోతే ఎలాగా? అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూసుకుందాములే అనుకుంటాను. నిజం చెప్పాలంటే అది నాలోని మైనస్. ఎందుకంటే రేపటి రోజున అవసరమైన వాటి గురించి అప్పటికప్పుడు వెతుక్కోవలసి వస్తుంది. రేపటి గురించి ఆలోచించడమనేది నేను ఇంతవరకూ నేర్చుకోలేదు. అది నేర్చుకోవాలనే శైలజ ఆశపడుతూ ఉంటుంది" అంటూ ఆయన నవ్వేశారు.    
subhalekha sudhakar
sailaja

More Telugu News