Hyderabad: అక్కినేని నాగార్జున ఫామ్ హౌస్ లో కరెంట్ షాక్ తో దంపతుల మృతి!

  • హైదరాబాద్ శివార్లలో నాగ్ వ్యవసాయ క్షేత్రం
  • అక్కడే పని చేస్తున్న వెంకటరాజు, దుర్గ
  • ట్రాన్స్ ఫార్మర్ చూసేందుకు వెళ్లగా కరెంట్ షాక్
హైదరాబాద్ శివార్లలోని కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ ప్రాంతంలో ఉన్న అక్కినేని నాగార్జున ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న దంపతులు కరెంట్ షాక్ తో మృతిచెందారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు (36), దుర్గ (32) నాగ్ వ్యవసాయ క్షేత్రంలో కూలీలుగా పని చేస్తున్నారు.

రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో పొలంలోనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. విద్యుత్ ప్రవహిస్తున్న తెగిపడిన వైర్ ను గమనించక దాన్ని తాకాడు. కరెంట్ షాక్ తో భర్త విలవిల్లాడుతుంటే, అతన్ని కాపాడేందుకు దుర్గ ప్రయత్నించగా, ఆమెకూ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad
Nagarjuna
Farm House
Current Shock

More Telugu News