Madhya Pradesh: బిడ్డతో కలసి రైలు కింద పడడానికి పట్టాలపైకి దూకింది.. అయినా ప్రాణాలు మిగిలాయి!

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • పుష్పక్ ఎక్స్ ప్రెస్ కింద దూకిన యువతి
  • ట్రాక్ మధ్యలో పడటంతో మిగిలిన ప్రాణాలు
భర్తతో విభేదాల కారణంగా మరణించాలన్న ఉద్దేశంతో బిడ్డతో సహా రైలు పట్టాలపై పడుకున్న ఓ యువతికి భూమ్మీద ఇంకా నూకలు మిగిలుండటంతో ప్రాణాలు మిగిలాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, తన బిడ్డతో కలసి మధ్యప్రదేశ్, భూర్హన్‌పూర్‌ జిల్లాలోని నేపానగర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తబుస్సుమ్ అనే మహిళ, పుష్పక్ ఎక్స్ ప్రెస్ స్టేషన్ ను సమీపిస్తున్న వేళ, ఒక్కసారిగా పట్టాలపైకి దూకింది.

చుట్టూ చూస్తున్న జనాలు అరుస్తుండగానే రైలు వారిపై నుంచి వెళ్లిపోయింది. అయితే, ఇద్దరికీ చిన్న గాయం కూడా కాలేదు. సరిగ్గా ట్రాక్ కు మధ్యగా వీరు పడటంతో, రైలు వారి మీదుగా వెళ్లిపోయింది. ఆమె బిడ్డను తన చేతులతోనే పట్టుకుని, షాక్ కు గురికాగా, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న తాను, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చనిపోవాలని భావించానని ఆమె తెలిపింది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ముంబైలోని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు.
Madhya Pradesh
Train
Pushpak Express
Accident

More Telugu News