Renu Desai: అంతా అయిపోయిందిగా... ఇంకా దాపరికం ఎందుకు?: రేణూ దేశాయ్ ని నిలదీస్తున్న పవన్ అభిమానులు!

  • నిన్న జరిగిన రేణూ దేశాయ్ నిశ్చితార్థం
  • వరుడు ఎవరో ఇంకా బయటపెట్టని రేణు
  • ఎవరో చెప్పాలంటున్న ఫ్యాన్స్
గత కొంత కాలంగా తాను రెండో పెళ్లికి సిద్ధపడుతున్నట్టు చెబుతూ వచ్చిన పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, నిన్న తన నిశ్చితార్థం జరిగిందని చెబుతూ, ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోను పోస్టు చేయగా, దానిపైనా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. పలువురు ఆమెకు శుభాభినందనలు చెబుతుండగా, మరికొందరు మాత్రం అతనెవరో ఎందుకు దాచి ఉంచుతున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు.

తాను ఎవరిని వివాహం చేసుకోనున్నానన్న విషయాన్ని రేణూ ఇంకా బయట పెట్టలేదన్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం కూడా అయిపోయిన తరువాత దాపరికం ఎందుకన్న ప్రశ్న రేణూ దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి ఎదురవుతుండగా, ఇంకా ఆమె స్పందించలేదు. కాగా, నిన్న పట్టుచీర ధరించి తన కుమారుడు, కుమార్తెతో కలసి నడుస్తున్న చిత్రాన్ని, అంతకుముందు ఓ వ్యక్తి తన ఉంగరపు వేలుకు రింగ్ తొడుగుతున్న చిత్రాన్ని ఆమె పోస్ట్ చేయగా, అవి నిమిషాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Renu Desai
Pawan Kalyan
Fans
Engagement

More Telugu News