Narendra Modi: తన ఇంటికి 20 ఏళ్ల నుంచి ప్రభుత్వం అద్దె పెంచడం లేదట.. ప్రధాని నరేంద్ర మోదీ మేనత్త ఫిర్యాదు!

  • 1983లో ప్రభుత్వ మెడికల్ షాప్ కు భవంతిని అద్దెకిచ్చిన నరోత్తందాస్ మోదీ
  • అద్దెను పెంచడం లేదని కేంద్రానికి ఫిర్యాదు
  • సీఐసీని ఆశ్రయించిన మోదీ మేనత్త
దాహీబెన్ నరోత్తందాస్ మోదీ... ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా మేనత్త. ఆమె వయసు ఇప్పుడు 90 సంవత్సరాలు. ఆమె ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. తన ఇంట్లో ప్రభుత్వ మెడికల్ షాపు ఉందని, 20 సంవత్సరాలుగా అద్దె పెంచడం లేదని ఆమె ఆరోపిస్తూ, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.

ఐదేళ్లకోసారి అద్దెను పెంచాల్సి వుండగా, అలా చేయడం లేదని, 1998 నుంచి రూ. 1,500 అద్దెపైనే భవనాన్ని వాడుకుంటున్నారని ఆమె కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) దృష్టికి తీసుకొచ్చారు. గత 20 ఏళ్లుగా పెంచాల్సిన అద్దె బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమేనా? అన్న విషయం చెప్పాలని కోరుతూ ఆమె సీఐసీని ప్రశ్నించారు. కాగా, అద్దెను రెన్యువల్ చేసేందుకు తాజా పత్రాలను సమర్పించాలని దాహీబెన్ నరోత్తందాస్ మోదీకి లేఖలు రాసినా, ఆమె వాటిని సమర్పించలేదని, అందువల్లే లీజ్ ను రెన్యువల్ చేయలేకపోయామని అధికారులు అంటున్నారు.
Narendra Modi
Dahiben Narottamdas Modi
Medicle Shop
Rent

More Telugu News