Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  సీనియర్ హీరోయిన్ నయనతార మరోసారి వెంకటేశ్ తో జతకట్టనుంది. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, చైతూ హీరోలుగా 'వెంకీ మామ' పేరిట ఓ మల్టీ స్టారర్ నిర్మిస్తున్నారు. ఇందులో వెంకీ సరసన నయన్ ను తీసుకుంటున్నట్టు, చైతూ సరసన సమంత నటిస్తున్నట్టు సమాచారం.
*  నారా రోహిత్ తన తొలి చిత్ర (బాణం) దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. బాణం, బసంతి వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చైతన్య తాజాగా రోహిత్ కోసం యుద్ధం నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేశాడట.
*  గతంలో రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి చిత్రం 'మగధీర'ను జపాన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జపనీస్ భాషలోకి అనువదించే పనులు జరుగుతున్నాయట.  
Go Back to Shorts
Nayanatara
Venkatesh
Charan
samanta

More Telugu News