danam: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్

  • దానం, అనుచరులకు పార్టీ కండువా కప్పిన సీఎం కేసీఆర్
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు
  • తెలంగాణ భవన్ వద్ద దానం అనుచరుల సందడి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో దానం, ఆయన అనుచరులకు  సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలకు ఆకర్షితుడనై టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు దానం ప్రకటించారు.     
danam
kcr
TRS

More Telugu News