renu desai: రేణూ దేశాయ్ ఎంగేజ్ మెంట్.. ఫొటో వైరల్

  • ‘ఎంగేజ్డ్’ అంటూ రేణూ దేశాయి పోస్ట్
  • తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై చేయి వేసిన రేణూ  
  • ఎంగేజ్ మెంట్స్ రింగ్స్ ధరించి ఉన్న ఫొటో పోస్ట్
నటి రేణూదేశాయ్ తన రెండో పెళ్లి గురించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, చేసిన ఓ పోస్ట్ లో తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్టు పేర్కొంది. తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ దేశాయ్ చెయ్యేసిన ఫొటోలో ఎంగేజ్ మెంట్స్ రింగ్స్ ధరించి ఉండటం గమనించవచ్చు. బాధ నుంచి కోలుకునేందుకు తనకు సహాయంగా నిలిచిన నిజాయతీ మనసుకు ధన్యవాదాలంటూ తనకు కాబోయే భర్తకు థ్యాంక్స్ చెప్పింది. తన జీవిత భాగస్వామి ఎవరు? అనే విషయాన్ని ఈ పోస్ట్ లో ఆమె ప్రస్తావించలేదు.  
renu desai
Instagram

More Telugu News