Big Boss: హౌస్ లో ఇతరుల ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నావ్!: కిరీటి దామరాజుపై నాని నిప్పులు

  • మూడో వారంలోకి ప్రవేశించిన బిగ్ బాస్ సీజన్ 2
  • పోటీదారుల మధ్య విభేదాలు తారస్థాయికి
  • ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హోస్ట్ నాని
బిగ్ బాస్ సీజన్-2లో అసలు మజా మొదలైంది. 'ఏమైనా జరగొచ్చు' అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభమైన ఈ సీజన్ మూడో వారానికి ప్రవేశించగా, కెప్టెన్ టాస్క్ లో భాగంగా కిరీటి గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాడని నాని అన్నాడు. అమ్మాయిల తరఫున మాట్లాడుతూ, ఇతర కంటెస్టెంట్ ల ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలను కిరీటి చేస్తున్నాడని, అదేమైనా మగతనమా? అని ప్రశ్నించాడు. మాటలతో బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నావని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

ఇక తొలి రోజు నుంచి ఓ గ్రూప్ గా ఏర్పడిన కొందరు తన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మరో కంటెస్టెంట్ కౌశల్ ఆరోపించాడు. తనకిచ్చిన టాస్క్ లో భాగంగా ఓ పని చేస్తే, పదేపదే దాన్ని ఎత్తి చూపుతున్నారని, హౌస్ లోని వాళ్లు కనీస మానవతా విలువలను చూపించడం లేదని వ్యాఖ్యానించాడు. అందరిదీ కపట ప్రేమేనని అన్నాడు. ఈ ఎపిసోడ్ లో కౌశల్, తనీష్ ల మధ్య ఉన్న విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నాడు దాదాపు కొట్టుకునేంత పని చేసిన వీరు, నిన్న కూడా తమ వైఖరిని మార్చుకోలేదు.

ఇక 'బిగ్ బాస్'పై నిప్పులు చెరిగిన గోగినేని బాబును నాని ప్రశంసించాడు. ఆటగాళ్లకు గాయాలవుతుంటే, బిగ్ బాస్ నిర్లక్ష్యంగా ఎలా ఉంటాడని ప్రశ్నించిన గోగినేని, మంచి పనే చేశారన్న నాని, ఇకపై చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పాడు.
Big Boss
Season 2
Kireeti
Nani

More Telugu News