nagachaitanya: మరోసారి అక్కినేని పాత్రలో కనిపించనున్న చైతూ?

  • క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ 
  • ఏఎన్నార్ పాత్రపై కసరత్తు 
  • చైతూతో సంప్రదింపులు             
సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో ఏఎన్నార్ పాత్రను నాగచైతన్య పోషించాడు. సావిత్రి .. ఏఎన్నార్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వాళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఆ సినిమాలో ఏఎన్నార్ పాత్ర అవసరం కావడంతో చైతూ చేశాడు. అలా ఏఎన్నార్ గా ఆయన మరోసారి తెరపై కనిపించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

బాలకృష్ణ ప్రధాన పాత్రగా 'ఎన్టీఆర్ ' బయోపిక్ ను క్రిష్ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. అందువలన ఎన్టీఆర్ కెరియర్లో అక్కినేని పాత్ర కనిపించి తీరుతుంది. ఈ కారణంగానే చైతూను సంప్రదించిన క్రిష్ .. ఏఎన్నార్ పాత్రను పోషించమని కోరాడట. ఏఎన్నార్ పాత్ర నిడివి ఎక్కువగానే వుంటుందనీ .. సన్నివేశాలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టుగా సమాచారం. మరి చైతూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.  
nagachaitanya
krish

More Telugu News