vijay devarakonda: యూత్ ను ఆకట్టుకునేలా 'గీత గోవిందం' ఫస్టులుక్

  • పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం'
  • విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక మందన 
  • నిర్మాతగా బన్నీ వాసు     
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా 'గీత గోవిందం' సినిమా రూపొందుతోంది. 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో అందమైన ఈ ప్రేమకథ రూపొందుతోంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు.

 విజయ్ దేవరకొండ ఒక గోడకు ఆనుకుని .. మరో గోడకి తన కాళ్లను తన్నిపట్టి ఉంచాడు. అతని కాళ్లపై కథానాయిక కూర్చుని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఆమె కళ్లలోకి చూస్తూ కథానాయకుడు మురిసిపోతున్నాడు. ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తూ .. యూత్ ను ఆకట్టుకునేదిలా అనిపిస్తోంది. "నా కాళ్లు తిమ్మిరెక్కినా .. నడుము నెప్పిలేచినా .. మీ బరువు .. బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్" అంటూ ఈ పోస్టర్ లోని స్టిల్ కి తగినట్టుగా విజయ్ దేవరకొండ కామెంట్ రాశాడు.      
vijay devarakonda
rashmika

More Telugu News