kcr: కేసీఆర్ అజ్మీర్ పర్యటన..విశ్రాంతి భవన నిర్మాణానికి భూమి పూజ!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 26న రాజస్థాన్ కు వెళ్తున్నారు. రాజస్థాన్ లో ఉన్న ప్రఖ్యాత అజ్మీర్ దర్గా వద్ద అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఐదు ఎకరాల్లోని స్థలంలో తెలంగాణ ప్రభుత్వం విశ్రాంతి భవనాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ఈ విశ్రాంతి భవనానికి భూమి పూజ చేయడానికి కేసీఆర్ అక్కడకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి 25 ముస్లింలు అజ్మీర్ వెళ్తున్నారు. 25వ తేదీన వీరందరినీ ప్రత్యేక రైలులో అజ్మీర్ తరలించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 100 మంది ముస్లింలు వెళ్తున్నారు.
Go Back to Shorts
kcr
azmir
Rajasthan
trip

More Telugu News