Asaduddin Owaisi: భారతీయ ముస్లింలు దేశాన్ని కాపాడుకునేందుకు తిరిగి పోరాడాలన్న అసదుద్దీన్ ఒవైసీ

  • ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ ఘటన సిగ్గుచేటు
  • రువాండాలా ఈ దేశం మారిపోతోంది
  • ట్విట్టర్లో అసదుద్దీన్ ఒవైసీ స్పందన
భారతీయ ముస్లింలు మరోసారి దేశాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఓ ముస్లిం వ్యక్తిని పశువుల దొంగగా భావించి స్థానికులు కొట్టి చంపిన సంఘటనపై ఒవైసీ స్పందించారు. ఈ దేశం రువాండా మార్గంలో వెళుతోందన్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనను సిగ్గుపడేదిగా అభివర్ణించారు.

రువాండాలో 1994 నాటి మారణకాండలో 8 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. టుట్సి తెగలవారిని హుటు వేర్పాటువాదులు లక్ష్యంగా చేసుకుని మారణకాండ సృష్టించారు. ఇక తన ట్విట్టర్ ఖాతాలో ఒవైసీ తాజా దాడికి సంబంధించిన వీడియో ఒకదాన్ని పోస్ట్ చేశారు. ఇందులో సముయద్దీన్ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో రక్తమోడుతున్న దృశ్యం కనిపిస్తోంది. 
Asaduddin Owaisi
majlis

More Telugu News