Pawan Kalyan: పోరాటం చేసే వారికి తెగువతో పాటు విషయ పరిజ్ఞానం వుండాలి!: పవన్ కల్యాణ్

  • జనసేన కార్యకర్తలకు బూత్‌ స్థాయిలో శిక్షణ తరగతులు
  • ఉత్తరాంధ్ర నుంచి శిక్షణ ప్రారంభం
  • దేవ్‌తో పాటు వారి బృందానికి పర్యవేక్షణ బాధ్యతలు
పోరాటం చేసే వారికి తెగువతో పాటు విషయ పరిజ్ఞానం కూడా వుండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇందులో భాగంగా జనసేన కార్యకర్తలకు బూత్‌ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు, ప్రజల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న భేదాభిప్రాయాలు తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ శిక్షణా కార్యక్రమాలను పార్టీ నియమించిన దేవ్‌తో పాటు వారి బృందం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులో ఉత్తరాంధ్ర నుంచి ఈ శిక్షణను ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమానికి అందరూ హాజరై పరిపూర్ణులు అవ్వాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana Sena
Telangana
Andhra Pradesh

More Telugu News