Congress: సైపుద్దీన్ సోజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్

  • ఆయన వ్యాఖ్యలకు, పార్టీకి సంబంధం లేదు
  • భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగం
  • ఈ సత్యాన్ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు
కశ్మీర్‌ ప్రజలు స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారంటూ, కానీ అది సాధ్యం కాదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సైఫుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతోన్న విషయం తెలిసిందే. బీజేపీ నేతల నుంచి విమర్శలు వస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంపై స్పందించింది. సైఫుద్దీన్‌ వ్యాఖ్యలకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు.

సోజ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగమని, ఈ సత్యాన్ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కాగా, నోట్ల రద్దు నిర్ణయంలో అమిత్‌షా, ఇతర బీజేపీ నేతల ప్రమేయంపై ఇటీవల వచ్చిన వార్తల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సోజ్ వ్యాఖ్యలను రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్‌ మండిపడుతోంది.
Congress
BJP

More Telugu News