sunny leone: సన్నీలియోన్ కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

  • ఉత్తరాఖండ్ లో ఉన్న సన్నీలియోన్
  • ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే రియాల్టీ షో షూటింగ్ లో అస్వస్థత
  • ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగుందన్న వైద్యులు
బాలీవుడ్ నటి సన్నీలియోన్ అస్వస్థతకు గురైంది. పాప్యులర్ టీవీ రియాల్టీ షో అయిన 'ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే' సీజన్-11 షూటింగ్ సందర్భంగా కడుపు నొప్పితో ఆమె బాధపడింది. వెంటనే ఆమెను ఉత్తరాఖండ్ లోని కాషీపూర్ లో ఉన్న బ్రిజేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు. రేపు ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. సన్నీ కోలుకుందని ఆమె మేనేజర్ కూడా తెలిపాడు. ఉత్తరాఖండ్ లోని రామ్ నగర్ జిల్లాలో ఈ రియాల్టీ షో షూటింగ్ జరుగుతోంది.
sunny leone
ill
mtv
splitsvelle
bollywood

More Telugu News