Sania Mirza: గర్భవతిగా ఉన్న సానియా మీర్జా యోగా.. స్పందించిన మేనకాగాంధీ!

  • గర్భవతి అయిన సానియా మీర్జా
  • యోగా దినోత్సవం సందర్భంగా ప్రీనాటల్ యోగా
  • అభినందించిన మేనకాగాంధీ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గర్భిణులు చేసే ప్రత్యేక యోగా (ప్రీనాటల్ యోగా)ను చేసి అందరినీ ఆకట్టుకుంది సానియా. అంతేకాదు, గర్భిణులు చేసే ప్రత్యేక యోగా గొప్పదనాన్ని తెలిపేలా ట్వీట్ చేసింది.

"యోగా దినోత్సవం కావచ్చు లేదా మరే ఇతర రోజైనా కావచ్చు. గర్భధారణ సమయంలో కూడా ఫిట్ గా ఉండేందుకు నేను ప్రయత్నిస్తా. ప్రీనాటల్ యోగానే నా మంత్రం. మరి మీరు?" అంటూ ట్వీట్ చేసింది.

సానియా ట్వీట్ పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ స్పందిస్తూ... 'వండర్ ఫుల్ సానియా. ప్రీనాటల్ యోగా ద్వారా గర్భధారణ సమయంలో ఫిట్ గా ఉండవచ్చు' అంటూ రీట్వీట్ చేశారు.
Sania Mirza
maneka gandhi
yoga

More Telugu News