shkalaka shankar: 'జబర్దస్త్' నుంచి అందుకే బయటికి వచ్చేశాను: షకలక శంకర్

  • కొత్త కాన్సెప్టులు దొరకలేదు 
  • డబ్బుల గురించి ఆలోచించలేదు 
  • ఏదో ఒకటి చేసేద్దాంలే అనుకునే రకం కాదు  
 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో 'షకలక శంకర్' ఒకరుగా కనిపిస్తాడు. ఒక వైపున కమెడియన్ గా తెరపై సందడి చేస్తూనే, మరో వైపున హీరోగా వచ్చిన అవకాశాలను కూడా ఆయన అందిపుచ్చుకుంటున్నాడు. తాజాగా ఆయన yoyo సినీ టాకీస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

'జబర్దస్త్' నుంచి ఎందుకు బయటికి వచ్చేశారు అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున 'జబర్దస్త్' చేసేవాడిని. కొంతకాలం 'జబర్దస్త్' చేసిన తరువాత నాకు కొత్త కాన్సెప్ట్ లు దొరకలేదు. అలాగని చెప్పేసి నేను ఏదిపడితే అది చేసేరకం కాదు .. డబ్బులొస్తున్నాయిగదా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కాన్సెప్ట్ లేకపోతే సంబంధం లేని విషయాలను గురించి మాట్లాడుకోవలసి వస్తుంది. తిట్లు .. బూతులు చోటుచేసుకోవడం జరుగుతుంది. అలాంటివి చేయడం ఇష్టం లేక .. ఆ విషయాన్ని నాగబాబుగారికి .. రోజా గారికి .. దర్శక నిర్మాతలకి చెప్పేసి బయటికి వచ్చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు.     
shkalaka shankar

More Telugu News