Pawan Kalyan: విజయవాడలో అద్దె ఇల్లు తీసుకున్న పవన్ కల్యాణ్... నేడు గృహ ప్రవేశం!

  • పటమటలో అద్దె ఇల్లు తీసుకున్న పవన్ కల్యాణ్
  • సొంత ఇల్లు ఇంకా సిద్ధం కానందునే 
  • నిన్ననే విజయవాడ చేరుకున్న పవర్ స్టార్ 
అమరావతి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. పటమటలో ఉన్న సువిశాలమైన ఈ ఇంట్లోకి పవన్ నేడు గృహ ప్రవేశం చేయనున్నారు. కాగా, పవన్ నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో దాదాపు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్కడ తన ఇంటిని, కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతోనే, అద్దె ఇల్లు తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న పవన్, మరో రెండు రోజుల పాటు విజయవాడ ప్రాంతంలోనే ఉంటారు.
Pawan Kalyan
Vijayawada
Amaravati
New Home
Rent Home
Patamata
House Warming Seremony

More Telugu News