Chandrababu: చంద్రబాబు అంటే బీజేపీ భయపడుతోంది: మంత్రి ఆదినారాయణరెడ్డి

  • నిత్యం బీజేపీ అబద్ధాలు చెబుతోంది
  • బీజేపీని, దానికి మద్దతుగా నిలిచిన వైసీపీని తరిమికొట్టాలి
  • ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకూ మా పోరాటం ఆగదు
చంద్రబాబు అంటే బీజేపీ భయపడుతోందని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. నిత్యం అబద్ధాలు చెబుతున్న బీజేపీని, ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన వైసీపీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకూ తమ పోరాటం ఆగదని మరోసారి స్పష్టం చేశారు.

బీజేపీ, వైసీపీ నేతలు తోడుదొంగలని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ క్యాట్ వాక్ చేస్తున్నారని విమర్శించారు. ‘జగన్..మోదీ ప్రేమలో పడ్డారు. మీరిద్దరూ ప్రేమించుకోండి కానీ, రాష్ట్రానికి నష్టం చేయొద్దు’ అని హితవు పలికారు.

రాష్ట్ర విభజన పాపంలో బీజేపీ ఏ2 ముద్దాయని మంత్రి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడిందని, విభజన హామీల అమలు కోసం మోదీ ఇంటి ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu

More Telugu News