warla: బ్రాందీ షాపులో పనిచేసిన బొత్సకు అంత ఆస్తి ఎలా వచ్చింది?: వర్ల రామయ్య

  • చంద్రబాబుని విమర్శించే నైతిక హక్కు బొత్సకు లేదు
  • గాంధీ‌భవన్‌ని బొత్స బ్రాందీ భవన్‌గా మార్చారు
  • ఆయనో లిక్కర్ కింగ్        
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే నైతిక హక్కు బొత్సకు లేదని అన్నారు. అప్పట్లో హైదరాబాద్‌లోని గాంధీ‌భవన్‌ని బొత్స బ్రాందీ భవన్‌గా మార్చారని, ఆయనో లిక్కర్ కింగ్ అని చురకలంటించారు. బొత్స సత్యనారాయణ ఆస్తులపై, అవినీతిపై విజయనగరంలో బహిరంగచర్చకు రావాలని, బ్రాందీ షాపులో పనిచేసిన ఆయనకు అంత ఆస్తి ఎలా వచ్చిందని నిలదీశారు.                              
warla
Botsa Satyanarayana
YSRCP
Telugudesam

More Telugu News